telugu navyamedia
రాజకీయ వార్తలు

వలస కార్మికుల పాలిట విఘాతం.. మమతపై అమిత్ షా విమర్శలు

amith shah bjp

వలస కార్మికుల తరలింపులో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు.కేంద్రానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని అన్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.

రాష్ట్రంలోకి వలస కార్మికుల రైళ్లను అనుమతించకపోవడం అన్యాయం అని షా పేర్కొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసి రెండు లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. కానీ బెంగాల్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వలస కార్మికుల పాలిట విఘాతంగా మారుతోందని విమర్శించారు. ఇకనైనా కార్మికుల సంక్షేమం నేపథ్యంలో కేంద్రం చర్యలకు సహకరించాలని హితవు పలికారు.

Related posts