ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు అప్పగిస్తారని చంద్రబాబు భయపడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆ భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెడుతుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఆ ప్రాంత రైతులు 80 వేల ఎకరాలను త్యాగం చేశారని, ఆ విషయం చంద్రబాబుకు గుర్తు లేదా? అని ప్రశ్నించారు.
రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో చంద్రబాబు రియలెస్టేట్ బినామీల అవకతవకలు బయట పడుతున్నాయని, వాటిని కప్పిపుచ్చడానికే పోరాటం పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో అమరావతి ప్రాంతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది: ఎంపీ కోమటిరెడ్డి