telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేనికైనా టైం రావాలండి .. : నిఖిల్

nikhil on suravaram movie release

యంగ్ హీరో నిఖిల్ స్టైల్. స్వామి రారా- కార్తీకేయ- సూర్య వర్సెస్ సూర్య- ఎక్కడికి పోతావు చిన్నవాడా? అంటూ ఎన్నో నూతన ప్రయోగాలతో మెప్పించిన విషయం తెలిసిందే. ప్రతిసారీ జోనర్ మార్చి ప్రయోగాలు చేసే సత్తా ఈ హీరోకి ఉంది. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా తెలివిగా కథలను ఎంచుకుంటూ స్టార్ రేస్ లోకి దూసుకొచ్చిన ఈ యంగ్ హీరోకి కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కొన్ని వరుస హిట్స్ పడ్డ తర్వాత కూడా కొత్తగా రూపొందించిన అర్జున్ సురవరం సినిమాని రిలీజ్ చేయడంలో తడబడ్డాడు. ఈ సినిమా రకరకాల కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ ఉండటం నిఖిల్ కెరీర్ కు బ్రేక్ వేసింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా ప్రభావం తరువాత సినిమాలపై బాగా పడింది. కొత్త సినిమాని ప్రారంభించకుండా నిఖిల్ వెయిట్ చేస్తున్నాడు పాపం.

అర్జున్ సురవరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2ని ప్రారంభించే ఆలోచనలో నిఖిల్ ఉన్నారని లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. కార్తికేయకు ఇది సీక్వెల్ సినిమా కాదని..పూర్తిగా కొత్త కథతో అదే జోనర్ లో ఉంటుందని సమాచారం. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు గా కథని తీర్చిదిద్దారని తెలుస్తోంది. అన్ని డైలమాల నుంచి బయటపడి తన నెక్స్ట్ ప్రాజెక్టు పై నిఖిల్ దృష్టిపెడితే మాత్రం అది తన ఫ్యాన్స్ కి శుభవార్తనే. అయితే చందు మొండేటి టీమ్ నుంచి ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.మరి నితిన్ లా గ్యాప్ వచ్చినా ఇప్పటి నుంచైనా కంటిన్యూ గా సినిమాలు చేయడానికి నిఖిల్ ప్లాన్ చేసుకుంటాడో లేదో చూడాలి.

Related posts