telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు.

ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి, ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య దేవాలయంకు జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ పార్టీ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా అంటూ నిలదీశారు.

‘గత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది. గత ప్రభుత్వంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా తుప్పుపట్టాయి.

గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 75 రోజులు పని దినాలు మాత్రమే నడిచాయి. భారతదేశంలో ప్రతి అసెంబ్లీ తక్కువలో తక్కువ 60 రోజులు జరగాలి అని పాట్నాలో తీర్మానించాం.

కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే 31 రోజులు సమావేశాలు జరిగాయి. 17, 18 నుండి అసెంబ్లీ సమావేశాల ఉండవచ్చు. భారతదేశంలో ఏ పౌరుడు అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే బావుంటుంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది అని మాజీ CM ఎలా అంటారు.’ అని అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

Related posts