telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యతోపాటు ఆహారం కూడా క్వాలిటీగా ఉండాలి: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సచివాలయంలో సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో నాణ్యమైన విద్యతోపాటు ఆహారం కూడా క్వాలిటీగా ఉండాలని ఆదేశించారు.

అధికారులు క్రమం తప్పకుండా హాస్టల్స్ ను తనిఖీలు చేయాలని సూచించారు. స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్లు జగన్ స్పష్టం చేశారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టల్స్‌లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. మూడు దశల్లో వసతిగృహాల్లో తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించబోతున్నట్లు జగన్ హామీ ఇచ్చారు.

Related posts