telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాహుల్ సిప్లిగంజ్ పై దాడి తీవ్ర గాయాలు

rahul sipliganj won bigg boss 3 title

బిగ్ బాస్ 3 విజేత, గాయకుడు, రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. పబ్బులో జరిగిన గొడవలో కొందరు వ్యక్తుల తలపై బీరు సీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు బుధవారం రాత్రి 11.45 గంటల సమయంలో వచ్చారు. అక్కడే ఉన్న కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో రాహుల్ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో కొందరు యువకులు రాహుల్ ను బీరు సీసాలతో తలపై కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 లో అసలు ఫేవరేట్ ఏమాత్రం కాని రాహుల్ ఫైనల్ గా టైటిల్ విన్నర్ అయ్యాడు. వితిక, వరుణ్ సందేశ్ కంటే రాహుల్, పునర్నవి మధ్య నడిచే ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా సాగాయి.

Related posts