విధుల్లో అలసత్వం వహించడంతో హైదరాబాద్ నగరంలో ఓ ఏసీపీ పై బదిలీ వేటు పడింది. ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ చేశారు. నర్సింహారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. నంద్యాల నరసింహారెడ్డి ప్రగతిభవన్ ముందు ఇంచార్జ్‌గా ఉన్నారు. విధుల్లో అలసత్వం వహించినందుకే ఏసీపీని బదిలీ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఆసిఫ్‌నగర్ సబ్‌డివిజన్ బాధ్యతలు డీసీపీ సుమతికి అప్పగించారు.

