నితిన్.జి దర్శకత్వంలో ధ్రువ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “అశ్వమేథం”. ప్రాచి, సోన్యా, శివంగి కేదార్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సుమన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఈరోజు విడుదల చేశారు చిత్రబృందము. ఈ టీజర్ లో “నేను నేను కాదు.. నాకు ఉనికి లేదు. నా వృత్తే నాకు ఉనికి లేకుండా చేసింది… చదరంగం ఆడడం అంటే నాకు చాలా ఇష్టం… కానీ నా జీవితమే చదరంగమైంది” అంటూ హీరో చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చదరంగంలో ప్రావీణ్యమున్న ఒక వ్యక్తి ఊహించని పరిస్థితుల్లో చిక్కుకోవడం.. అనుకోకుండా హత్యలు చేయడం.. తనను ఆ పరిస్థితులకు ప్రేరేపించిన అతీతమైన శక్తిని తెలుసుకునే ప్రయత్నమే “అశ్వమేథం”. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.
							previous post
						
						
					
							next post
						
						
					


ఇప్పటికే 20 సార్లు పెళ్లైపోయింది… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్