telugu navyamedia
సినిమా వార్తలు

“సైలెన్స్”లో అనుష్క లుక్

Anushka

హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న చిత్రం “సైలెన్స్”. ఈ చిత్రంలో అనుష్క, మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్‌ అవసరాల, సుబ్బరాజు, హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడసన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో “నిశబ్దం”గా, తమిళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో “సైలెన్స్‌”గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది. అయితే… అంతకు ముందే ప్రేక్షకులకు చిన్నపాటి సర్‌ప్రైజ్‌ ఇచ్చారామె. సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. అందులో తన ఆహార్యం, హావభావాలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. పొట్టి జుట్టుతో చేతిలో పుస్తకం పట్టుకున్నట్టు అర్ధమవుతుంది. “త్వరలో స్పాట్‌లైట్‌లోకి వస్తాను” అంటూ ఆ ఫోటోను పోస్ట్ చేశారు అనుష్క.

Related posts