telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీలో ఇప్పటి వరకు 97 కరోనా కేసులు: కేజ్రీవాల్

kejriwal on his campaign in ap

ఢిల్లీలో ఇప్పటి వరకు 97 కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని మర్కజ్ మసీదు నుంచి బయటకు తీసుకొచ్చిన వారిలో 441 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని మర్కజ్ భవన్ లో ఉండొచ్చిన 1500 మంది తబ్లీక్ జమాత్ గ్రూప్ కార్యకర్తలు క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. అందులో 24 మంది మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారేనని అన్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య పెరుగుతోందని, అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా మర్కజ్ భవన్ లో కార్యక్రమాలు నిర్వహించడం బాధ్యతా రాహిత్యమైన చర్య అని విమర్శించారు.

Related posts