telugu navyamedia
రాజకీయ

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా నరవణె

ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణెను చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. డిఫెన్స్ స్టాఫ్ ఛీఫ్ గా వ్యవహరించిన బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో ఆయన తర్వాత నరవణెను నియమించారు. త్రివిధ దళాలాల అధిపతుల్లో సీనియర్ గా ఉన్నవారిని డిఫెన్స్ స్టాఫ్ కమిటీ చీఫ్ గా నియమించేవారు.

మనోజ్ ముకుంద్ నరవణె చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటు ఆయన నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు జనరల్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ సైనిక బలగాలను పర్యవేక్షిస్తుంది. 2019లో డిఫెన్స్ స్టాఫ్ ఛీఫ్ ను కొత్తగా సృష్టించారు. జనరల్ రావత్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి తొలి ఛైర్మన్ గా వ్యవహరించారు.

Rawat: Army prepared for border challenges

మనోజ్ ముకుంద్ నరవణె తండ్రి రిటైర్డు ఆర్మీ అధికారి ముకుంద్ నరవణె, తల్లి సుధ ఆలిండియా రేడియా అనౌన్సర్. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో విద్యాభ్యాసమంతా.. సైనిక విద్యాసంస్థల్లోనే సాగింది. పూణెలో జ్ఞాన‌ప్రభోదిని ప్రశాల‌లో విద్యాభ్యాసం చేశారు. పూణె నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, డెహ్రడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ, వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ, యుద్ధసైనిక ప్రధాన కార్యాలయం ఆర్మీ వార్ కాలేజీలో చదువుకున్నారు.

మద్రాసు యూనివర్శిటీలో డిఫెన్స్ స్టడీస్ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. ఇండోర్ దేవీ అహిల్యా విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంఫిల్ చేశారు. పాటియాల పంజాబ్ యూనివర్శిటీలో డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ విభాగంలో పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించే ప్రయత్నంలో ఉన్నారు.

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా జనరల్ నరవణె | All Time Report

1980లో ఏడో బెటాలియన్ లో సిక్ పదాతిదళంలో చేరిన మనోజ్ ముకుంద్ నరవణె 40 యేళ్లకు పైగా వివిధ విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.

7, జూన్ 1982 లో లెఫ్టినెంట్
7, జూన్ 1985 కెప్టన్
7, జూన్ 1991 మేజర్
31, డిసెంబరు 2002లో లెఫ్టినెంట్ కల్నల్
1, ఫిబ్రవరి 2005 కల్నల్
19, జులై 2010 బ్రిగేడర్
1, జనవరి 2013 మేజర్ జనరల్
10, నవంబరు 2015 లెఫ్టినెంట్ జనరల్
31, డిసెంబరు 2019 ఆర్మీస్టాఫ్ ఛీఫ్ జనరల్
16, డిసెంబరు 2021 చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్

సీడీఎస్‌ నియామకం తర్వాత నుంచి ఈ కమిటీకి జనరల్ రావత్‌ ఛైర్మన్‌గా కొనసాగారు. డిసెంబరు 8న తమిళనాడులో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన దుర్ఘటనలో జనరల్ రావత్‌ దంపతులు సహా 14 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీవోఎస్‌సీ కమిటీ బుధవారం సమావేశమై రావత్‌ దంపతులకు నివాళులర్పించింది. ఆ తర్వాత జనరల్ నరవణె కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Related posts