telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీఎస్ఆర్టీసీ ఫుల్.. టీఎస్ఆర్టీసీ నిల్!

no rtc charges effect between telugu states

సంక్రాంతి సీజన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో కిటకిటలాడుతుండగా, తెలంగాణ బస్సులు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పండగ సీజన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య డిమాండ్ అధికంగా ఉండగా, ఇరు రాష్ట్రాల బస్సు టికెట్ల మధ్య భారీ తేడా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నఏపీ ఆర్టీసీ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే బస్సు టికెట్ ధరలను 40 శాతం తగ్గించింది.

హైదరాబాద్ కు వెళ్లి, ప్రయాణికులను తీసుకుని వచ్చే బస్సుల డీజిల్ ఖర్చులైనా రావాలన్నది ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల ఆలోచన. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వారితో ఈ బస్సులు నిండిపోతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ అధికారులు మాత్రం చార్జీలను తగ్గించలేదు. దీంతో హాఫ్ రిటర్న్ చార్జీతో విజయవాడ వెళ్లిన బస్సులు, పూర్తి ఖాళీగా వెనక్కు వస్తున్న పరిస్థితి నెలకొనట్టు తెలుస్తోంది.

ఉదాహరణకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చార్జీ రూ. 372 కాగా, ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చార్జీ రూ. 223గా ఉంది. కాగా, మనం కూడా ఏపీ మాదిరిగా చార్జీలను తగ్గిద్దామని కొన్ని డిపోల మేనేజర్లు కోరినా, ఉన్నతాధికారులు అంగీకరించలేదని సమాచారం.

Related posts