telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ కు జగన్…రేపు కేసీఆర్ తో చర్చలు!

cm jagan and KCr

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆయన ఉంటారని సీఎంఓ అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్యా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. కృష్ణా జలాల పంపకం సహా పలు అంశాలపై భేటీ ఉంటుందని అన్నారు. 14న గుడివాడలో జగన్ పర్యటన ఖరారైంది. ఇక్కడ జరిగే ఎడ్ల పందాలను ముఖ్యమంత్రి స్వయంగా తిలకించనున్నారు.

Related posts