కరోనా గత ఏడాది విద్యార్థుల చదువును నాశనం చేసింది. అయితే అప్పుడు ముసుకు పాఠశాలలు మళ్ళీ తేలుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి. 7 నుంచి 10 తరగతి వరకు స్కూళ్ళు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒక్కపూట మాత్రమే స్కూల్స్ ఓపెన్ లో ఉన్నాయి. అయితే, జనవరి 18 వ తేదీ నుంచి ఒక్కపూట కాకుండా రెండు పూటలా స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి. అయితే.. కరోనా మహమ్మారి ప్రభావంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభించనుంది విద్యాశాఖ. ఇది ఇలా ఉంటే సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని.. రెండో శనివారాలు కూడా కాలేజీలు కొనసాగుతాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు పదో తరగతి విద్యార్థులకు ఇవాళ్టి నుంచి రెండు పూటలా తరగతులు జరుగనున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహించనున్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

