telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టికెట్‌ రేట్లపై డివిజన్‌ బెంచ్‌కి జగన్ సర్కారు..

ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది.సినిమా టికెట్ రేట్లు త‌గ్గింపు పై థియేట‌ర్ యాజ‌మాన్యుల వేసిన‌ ఫిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో నిన్న వాద‌న‌లు జ‌రిగాయి. టిక్కెట్ ధ‌ర‌ల‌ను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్‌ తరపు న్యాయవాదులు విన్న‌వించారు.

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్‌ యజమానులకు ఉంటుందన్నారు పిటిషనర్లు వాదించారు.

ఈ వాదనలను ఏకీభ‌వించిన హైకోర్టు ..ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది.

అయితే టికెట్‌ రేట్లపై హైకోర్టు తీర్పును స‌వాల్‌గా తీసుకున్న‌ జ‌గ‌న్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్‌ బెంచ్‌కి వెళ్లాలని నిర్ణయించింది. సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని అప్పీల్‌కు వెళ్లాలని ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంద‌ని స‌మాచారం. డివిజిన్ బెంచ్‌లో అయినా ప్ర‌భుత్వానికి న్యాయం జ‌రుగుతుందో లేదో వేచి చూడాలి మ‌రీ..!

Related posts