telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రైతులు కోసం మ‌రో అడుగు ముందుకు ఏపీ ప్ర‌భుత్వం..

ఆంధ్రప్రదేశ్‎లో‎ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒకే పంట సీజన్‌లో నష్టపరిహారం అందజేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్‌ సైక్లోన్‌ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే.

2021 సెప్టెంబర్‌లో వ‌చ్చిన‌ సైక్లోన్‌ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. 22 కోట్ల పంట నష్టపరిహారం సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.. ఈ క్రాప్‌ ఆధారంగా నమోదైన రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారు.

అయితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపరిహారం క్రింద 13.96 లక్షల మంది రైతులకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం రూ. 1,071 కోట్లుగా ఉంది.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్య క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు. రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రైతు ఇబ్బందిపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డుమీద పడుతుందని సీఎం తెలిపారు. ఇది తెలిసి కూడా గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా ఆలోచన చేయలేదని, రైతును చేయిపట్టి నడిపించే విధంగా ఎవరూ చేయలేదన్నారు.

ఇవాళ తాము తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉండాలని మనసా, వాచా, కర్మేణా కోరుకుంటూ..ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నామని సీఎం తెలిపారు.

Related posts