telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దేవాలయాల దాడుల పై పోలీస్ శాఖతో అప్రమత్తం : డిజిపి

ఏపీలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.  ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో ఒక్కసారిగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సీరియస్ అయ్యాయి.  ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది.  ఏపీలోని అన్ని దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.  ఏపీ పోలీసులతో పాటుగా, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.  అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై 100కి సమాచారం ఇవ్వాలని అన్నారు.  భద్రతా పరమైన చర్యలను పర్యవేక్షించాలని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు డీజీపీ.  ప్రతి ఒక్క దేవాలయానికి జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది… ఇకనైనా దాడులు ఆగుతాయా అనేది.

Related posts