telugu navyamedia
రాజకీయ వార్తలు

రేషన్ కార్డు లబ్దిదారులకు మరోసారి బియ్యం పంపిణీ!

Ration card telangana

లాక్‌డౌన్ కారణంగా పేదవారిని ఆదుకునేందుకు కేంద్రం రెండు సార్లు ఉచిత బియ్యం పంపిణీ చేసింది. ఇక జూన్ 1 నుంచి మూడోసారి పంపిణీకి సిద్ధమవుతోంది. ఆహార భద్రత కార్డు ఉన్న అందరికీ బియ్యం ఇచ్చేందుకు రూ.46వేల కోట్లు మంజూరు చేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 120 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత బియ్యాన్ని పొందనున్నారు.

ఒక్కో వ్యక్తికీ 12 కేజీల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే… కేజీ కందిపప్పు కూడా ఇవ్వనున్నారు. తెలంగాణలో 87.55 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ ప్రకారం 2.80 కోట్ల మంది లబ్దిదారులుగా ఉన్నారు. వారికి ఒక్కొక్కరికీ 12 కేజీల బియ్యం ఇవ్వాలి కాబట్టి.. మొత్తం 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు పంపుతున్నారు. అలాగే 27 వేల టన్ను కందిపప్పును కూడా పంపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు లాక్‌డౌన్ కాలంలో నెలకు రూ.1500 ఇస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఇచ్చింది. జూన్‌లో ఇవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తోంది.

Related posts