telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో ఆలయాల పై కొనసాగుతున్న దాడులు..

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడలో బస్టాండ్ సమీపంలోని ఆలయంలో  విగ్రహం ధ్వంసం చేసారు దుండగులు. బస్టాండ్ లోని నర్సరీ వద్ద ఉన్న పురాతన సీతారామ మందిరంలోని సీతాదేవి విగ్రహాన్ని విగ్రహం ద్వంసం చేసారు. ఇది గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తోన్నారు పోలీసులు. ఈ ఘటన గురించి తెలుకుకొని ఆలయం వద్దకు ఆర్టీసీ ఉద్యోగులు,తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. బస్టాండ్ సమీపంలోని సీతారామ మందిరం  వద్దకు తెదేపా నేత పట్టాభిరాం చేరుకున్నారు. సీతాదేవి విగ్రహం ధ్వంసం ఘటన పై విచారణ జరపాలని పోలీసులను కోరారు పట్టాభిరాం. ఎలుకలు లేదా గాలి ద్వారా విగ్రహం ధ్వంసమై ఉంటుందని సీఐ సత్యానందం తెలిపారు. సీఐ సమాధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు పట్టాభిరాం. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్ చేసారు పట్టాభిరాం. మరి చూడాలి ఈ దాడులు ఇప్పటివరకు ఆగుతాయి.. అనేది.

Related posts