కొవిడ్ నివారణ చర్యలపై అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. ఆసుపత్రి హెల్ప్‌లైన్ సహా పడకల ఖాళీ వివరాలను బ్లాక్‌బోర్డుపై రాయాలని జగన్ సూచించారు. ప్రతి జిల్లాలో కొవిడ్ ఆసుపత్రుల్లోని పడకల ఖాళీలు, భర్తీ వివరాలను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
ఎవరికైనా బెడ్ అందుబాటులో లేదంటే సమీప ఆసుపత్రిలో బెడ్ కేటాయించాలన్నారు. కొవిడ్ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల యాజమాన్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. బెడ్లు, వైద్యం, ఆహారం, శానిటేషన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలుంటే ప్రోత్సహించాలని సూచించారు.