telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సోమశిల హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన…

25laks houses by ugadi apcm

ఏపీ సీఎం జగన్ ఈ రోజు సోమశిల హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు .క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటూ మరిన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే సోమశిల రెెండో దశ పనులకు పునాది వేస్తున్నామని అన్నారు. నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం మాదన్న ఆయన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలోని మెట్ట ప్రాంతాలకు నీరందించేలా ప్రాజెక్టు ఉంటుందని అన్నారు. ఆత్మకూరులో 10103 ఎకరాలు, ఉదయగిరిలో 36350 ఎకరాలకు , మొత్తంగా 46453 ఎ కరాలకు కొత్తగా నీరందిస్తామని అన్నారు. రూ. 527.53 కోట్లతో ఇదే ప్రాజెక్టును ఎన్నికలకు ముందు హడావుడిగా చేయాలని గత ప్రభుత్వం ఆరాటపడింది.. కానీ ఏ పనులూ జరగలేదని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ చేసి రూ. 459 కోట్లకు తగ్గించామన్న ఆయన రూ. 68 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేసి పనులు మొదలు పెడుతున్నామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ స్థాయిలో అవినీతికి చెక్ పడిందనేది చెప్పేందుకు ఇదే నిదర్శనమని అన్నారు.

అలాగే పనులను యుద్ద ప్రాతిపదికన .. మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోగానే పూర్తి చేస్తామని అయన అన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీ  పనులను పూర్తి చేసి జనవరిలో ప్రజలకు అంకితం చేస్తామన్న ఆయన అధికారంలోకి వచ్చాక యుద్ద ప్రాతిపదికన సాగు నీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. సోమశిల, కండలేరు డబ్లింగ్ వర్క్ 12 వేల నుంచి 24 వేల క్యూసేక్కులకు రూ. 918 కోట్లతో పనులు ప్రారంబించబోతున్నామని సోమ శిల – రాళ్లపాడు డబ్లింగ్ వర్క్ కూడా 720 నుంచి1440 క్యూసెక్కులకు పెంచుతూ రూ. 632 కోట్లతో ప్రాజెక్టు పనులు చేస్తున్నామని అన్నారు. 2022 ఖరీఫ్ కు నీరిచ్చేలా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. 2020-21లో 6 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని వంశధార ఫేజ్-2, వంశధార – నాగావళి, వెలిగొండ, అవుకు టన్నెల్, సంగం, నెల్లూరు బ్యారేజీ పనులను పూర్తి చేస్తామని అన్నారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని రాయలసీమ కరవు నివారణ పనలుు చేపడుతున్నామని అయన అన్నారు. కృష్ణా నదిపై దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒకటి నిర్మిస్తున్నామన్న ఆయన చింతలపూడి లిఫ్ట్ పనులు వేగవంతం చేశామని తెలిపారు. 

Related posts