telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు మార్గనిర్దేశం – పీ4 కింద 250 కుటుంబాల దత్తత

తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్షలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నట్లు వివరించారు. బంగారు కుటుంబాలకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఆ క్రమంలో పీ4లో మార్గదర్శులుగా ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా మారారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్లు హాజరయ్యారు.

Related posts