telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్యాకేజ్ దోహదపడుతుంది: వెంకయ్య

Venkaiah-Naidu

కరోనా నేపథ్యంలో బలహీన పడిన ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ప్యాకేజ్ దోహదపడుతుందన్నారు.

దేశ ఆర్థిక స్వావలంబనకు ఈ ప్యాకేజ్ ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు ఈ ప్యాకేజ్ ద్వారా మేలు జరుగుతుందని భావించారు. ఆత్మనిర్భర భారత్ స్వప్న సాధనకు సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఇదేననని అన్నారు. స్థానిక పరిశ్రమలకు చేయూత నివ్వాలన్నారు. తద్వారా భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

Related posts