telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖ లో పర్యటించనున్నారు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖ లో పర్యటించనున్నారు.

ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.40 గంటలకు విశాఖ చేరుకుంటారు. పది నిమిషాలు ఎయిర్‌పోర్టులో గడిపిన తరువాత 10.50 గంటలకు బయలుదేరి ఆర్కే బీచ్‌రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు.

అక్కడ నుంచి పార్కు హోటల్‌ వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తారు.

అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించి, మధ్యాహ్నం 12.05 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు.

12.15 నుంచి 1.30 గంటల వరకు యోగా దినోత్సవంపై అధికారులతో సమీక్షిస్తారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు నోవాటెల్‌ హోటల్‌లో బయలుదేరి 2.50 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు.

సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.

Related posts