దక్షిణాదిలో తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ సినిమా రంగాల్లో అందరు స్టార్ హీరోలతో నటించి హిట్లు కొట్టిన ఘనత అనుష్కదే. ఏకంగా 14 సంవత్సరాల పాటు సౌత్‌ను ఏలేసింది. “అరుంధతి”తో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత “బిల్లా”, “పంచాక్షరి”, “రుద్రమదేవి”, “భాగమతి”, “సైజ్ జీరో” లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే… మరోవైపు “సింగం” లాంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ గ్లామర్ ఒలకబోసింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి”తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ‘భాగమతి’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ ఈ యేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ‘ఝన్సీ లక్ష్మీబాయి’గా కాసేపు కనిపించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్ధం అనే చిత్రం చేస్తుంది. ఇందులో దివ్యాంగురాలి పాత్రలో కనిపించి సందడి చేయనుంది. ఇక అనుష్క మరో ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ రచయిత గోవింద్ నిహ్లాని రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించనున్నారని చెబుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుండగా, ఇందులో బిగ్ బాస్ ఫేం అభిరామి వెంకటాచలం కీలక పాత్ర పోషిస్తారట. వేల్స్ ఫిల్మ్ ఇంటరన్ఏషన్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది.
previous post
next post


భీమ్లా నాయక్‌పై రామ్‌గోపాల్ వర్మ నెగిటివ్ కామెంట్స్..