ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ పథకాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ప్రారంభించారు.
అంతకుముందు వీరంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ బస్సులో ప్రయాణించారు.
అనంతరం విజయవాడ సిటీ బస్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఉచిత బస్సులను లాంఛనంగా ప్రారంభించారు
. ఈ పథకం అమలుతో ఏపీ వ్యాప్తంగా లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ పథకంలో ట్రాన్స్ జెండర్లను కూడా లబ్ధి చేకూరనుంది.
వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుంది: జేసీ దివాకర్ రెడ్డి