telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నైపుణ్యం… భవిష్యత్తు ఆశాజనకం

పని ఏదైనా సరే… ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తేనే భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోగలమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. ప్రయత్నిస్తే… ఆశాశం హద్దూకాదు… సముద్రం పెద్ద లోతూకాదనే విషయాన్ని అర్థమయ్యేవిధంగా విశదీకరించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కన్వెన్షన్ సెంటర్ లో ఇండియా స్కిల్స్ 2021 సౌత్ రీజినల్ కంపిటేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.యువతరం తమ భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకునేందుకు నైపుణ్యం కీలక పాత్రపోషిస్తోందన్నారు. వ్యక్తిగతంగా నైపుణ్యాన్ని పెంపొందించుకునే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకాలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. యువత భవిష్యత్తుగురించే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా , కన్నీళ్ల సుడిగుండంగా మారినా, మంచైనా.. చెడైనా, వెనుతిరిగి చూడొద్దని పోటీలో పాల్గొన్న యువతకి హితబోధచేశారు. నైపుణ్య పోటీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు,కేరళ రాష్ట్రాల యువతీయువకులకు అభినందనలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ అందరిని ఆకట్టుకుంది.

Related posts