telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ రెండోరోజు పర్యటన..

వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ నుంచి ఆయన బయలుదేరారు..నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన జగన్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం..

ముందుగా.. ఉదయం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ నుంచి బయల్దేరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు చేరుకుంటారు.

చింతూరు మండలంలోని కుయుగూరు, చట్టి గ్రామాల్లోని వరద బాధితులతో సమావేశం కానున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకోనున్నారు .ఈ పర్యటనలో బాగంగా.. ఇవాళ (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు.

ఈరోజు మధ్యాహ్నం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయ్యగుట్ట గ్రామంలోనూ జగన్ పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను జగన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత నార్లవరం, తిరుమలాపురం గ్రామాలకు చెందిన వరద బాధితులతో జగన్ సమావేశమవుతారు.

అనంతరం మధ్యాహ్నం 1గంట‌కు అక్కడి నుంచి బయలుదేరి సీఎం జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేశారు.

 

Related posts