telugu navyamedia
Uncategorized

గుంటూరు జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం జగన్..

గుంటూరు జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టును క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్‌. ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ… ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అన్ని పథకాల్లో వారికే ప్రాధాన్యం అని తెలిపారు. పాడి మహిళా రైతుల సంక్షేమం కోసమే అమూల్‌ ద్వారా పాల సేకరణ జరుగుతుంది. అమూల్‌ పాల సేకరణ ద్వారా అక్క చెల్లెమ్మలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రతి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా చెల్లించనున్నట్లు జగన్ తెలిపారు. గ్రామాల్లో పాల సేకరణ కోసం ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం జరగనుంది. 9899 గ్రామాల్లో దాదాపు రూ.4 వేల కోట్లతో పాల సేకరణ కేంద్రాల నిర్మిస్తున్నాం. పాడి రైతుల ముందే పాల నాణ్యత పరీక్ష. అంతా పారదర్శకం. రాష్ట్రానికి అమూల్‌ సంస్థ రాక ఒక విప్లవాత్మక కార్యక్రమం. అమూల్‌లో మహిళలే భాగస్వాములు. వారికే లాభాల పంపకం ఉంటుంది అని తెలిపారు.

Related posts