telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మొదటి సెషన్ లో 5 వికెట్లు కోల్పోయిన భారత్…

చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ చివరి రోజు భారత్ కష్టాల్లో పడింది. నిన్న ఆట ముగిసే సమయానికి 39/1 తో ఉన్న భారత్ ఈరోజు మొదటి సెషన్ పూర్తయే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న కోహ్లీ(45), అశ్విన్(2) ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ భారత్ ను హట్టి దెబ్బ తీసాడు. ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే గిల్(50) ను వెనక్కి పంపిన ఆండర్సన్ అదే ఓవర్లో రహానే ను డక్ ఔట్ చేసి తర్వాత ఓవర్లో పంత్(11) ను పెవిలియన్ కు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 276 పరుగులు చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. కాబట్టి కనీసం డ్రా చేసుకోవడానికైనా ప్రయత్నించాలి. కానీ ఇంగ్లాండ్ మరో 4 వికెట్లు తీస్తే ఈ టెస్ట్ ను తమ ఖాతాలో వేసుకుంటారు. అయితే భారత ఆటగాళ్లు కేవలం 4 వికెట్లతో ఇంగ్లాండ్ బౌలర్లను ఇంకా రెండు సెషన్లు ఆపడం చాలా కష్టాంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది… అయితే ఈ మ్యాచ్ రిజల్ట్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పైన ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలిసిందే.

Related posts