telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో” నెగెటివిటీపై యాంకర్ రవి ఫైర్… వీడియో

Ravi

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. అయితే ఈ సినిమా బాలేదంటూ నెగెటివ్ ప్రచారం చేస్తోన్న వారిపై యాంకర్ రవి మండిపడ్డారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. రూ.350 కోట్లు పెట్టి సినిమా తీయడం మామూలు విషయం కాదని, తనకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమాను రూపొందించారని చెప్పారు. ఈ మధ్య కాలంలో రియాక్ట్ అవ్వడం మానేశానని, కానీ ఈ సినిమా గురించి వీడియో పెట్టాలని అన్పించింది అని అన్నారు. ”నేను సెలూన్ కి వచ్చా.. అక్కడ చాలా మంది సినిమా బాగుందని అంటుంటే.. ఒక అబ్బాయి మాత్రం సినిమా బాలేదని చెప్పాడు.. ఏం బాలేదని అడిగితే ఏమో అన్నా.. సినిమా చూడలేదు.. యూట్యూబ్ లో రివ్యూ చూశా.. బాలేదని రాశారని చెప్పాడు.. సినిమా కోసం పాజిటివ్ రాయకపోయినా పర్లేదు కానీ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు.. అది కరెక్ట్ కాదు.. సినిమాను బతికిద్దాం..” అంటూ చెప్పుకొచ్చాడు రవి. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించాలని.. మన కోసం రెండు, మూడేళ్లు కష్టపడి సినిమా చేస్తారని.. అలాంటిది వారు శ్రమ గురించి నెగెటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. యూట్యూబ్‌లో లైక్స్ కోసం ఏవోవే రాస్తున్నారని అది తప్పని.. ఇలా మాట్లాడడం వలన తనను కూడా తప్పు పట్టే వాళ్లు ఉంటారని.. అలా మాట్లాడినా తనకేం నష్టం లేదని పేర్కొన్నాడు రవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

Related posts