చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాపై ఇప్పటికే ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రకటనలు చేసిందని చైనాపై విమర్శలు చేస్తోన్న అమెరికా పలు చర్యలకు సిద్ధమవుతోంది. కరోనా పుట్టుక వంటి అంశాలపై అమెరికా విచారణ జరుపుతోంది. దీనిపై వివరాలివ్వని పక్షంలో చైనాపై కఠిన ఆంక్షలు విధించడానికి ‘ది కొవిడ్-19 అకౌంటబిలిటీ యాక్ట్’ పేరిట సెనేట్‌లో బిల్లును ప్రవేశపెట్టారు.
కరోనా వైరస్ విజృంభణలో చైనా పాత్రపై అమెరికాతో పాటు తమ మిత్రపక్షాలు, ఐక్యరాజ్యస సమితి అనుబంధ సంస్థల విచారణకు చైనా నుంచి పూర్తి సహకారం లభించాల్సిందేనని బిల్లులో పేర్కొన్నారు. వైరస్ గురించిన సమాచారాన్నంతా అందించాలని అన్నారు. సమాచారం ఇవ్వడంలో చైనా విఫలమైతే అమెరికాలో దాని ఆస్తుల్ని స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధాలు, ఆ దేశానికి వీసా ఉపసంహరణతో పాటు తమ దేశ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇవ్వడాన్ని నిలిపేయడం వంటి ఆంక్షలు విధించనున్నారు. చైనాపై ఈ ఆంక్షలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు పూర్తి అధికారం ఉంటుందని అందులో పేర్కొన్నారు.
రేపు పాకిస్థాన్ కూడా టార్గెట్.. ఆరెస్సెస్ పై ఇమ్రాన్ ఫైర్