telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

ఆమెకూ ఓ పేరుంది….!

prema khaidi poetry corner
ఇంటి పేరును కోల్పోయి
ప్రథమావిభక్తులను భక్తితో స్వీకరిస్తూ
మెట్టినింటికి మంగళదీపంఅవుతుంది మగువ
ఆమెకూ ఓ పేరుంది….!
లింగవివక్షల కక్ష్యలో కాఠిన్యాలు
కాలనాగులై ప్రశ్నపత్రాలుసంధించినా
సంయమనాల సమాధానాలురాస్తుందిసుదతి      
ఆమెకూ ఓ పేరుంది….
సమాజగవాక్షాలు చక్షువులు సారించి
అవరోధాల రెక్కలంటించి
అబలలంటూ శాసనాలు రాస్తున్నా
ఎదురుగాలి లోనే జీవనగాలిపటాన్నిఎగురవేసే జాగృతి
ఆమెకూ ఓ పేరుంది ….!
అనవరతం ఆమెది సార్థక నామధేయం.ఆమెపేరే రశ్మిత.
                సోంపాక సీత
               భద్రాచలం.

Related posts