telugu navyamedia
సినిమా వార్తలు

చిత్రలహరి’స్లో అయ్యింది :4 రోజుల కలెక్షన్స్(ఏరియావైజ్)

Chitralahari

సాయి ధరమ్ తేజ్..లేటెస్ట్ మూవీ ‘చిత్రలహరి’ వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ ..గత సినిమాల ప్రభావం కలెక్షన్స్ పై పడకపోవటం కలిసొచ్చింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత సాయి ధరమ్ తేజ్‌కు చెప్పుకోదగ్గ హిట్ ‘చిత్రలహరి’ సక్సెస్‌తో లభించినట్టైయింది. అయితే సోమవారం నుంచి చిత్రానికి అసలు పరీక్ష ఎదురైంది. మెల్లిగా కలెక్షన్స్ స్లో అవటం మొదలైంది. అయితే పెట్టుబడిలో ఎనభై శాతం ఆల్రెడీ రికవరీ అవటంతో ఎవరూ పెద్దగా కంగారు పడటం లేదు. నాలుగు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణాలలో కలిసి 8.65 కోట్లు వసూలు చేసింది. ప్రాంతాల వారిగా బ్రేకప్ లిస్ట్ చూడండి.. :
ఏరియా షేర్ (కోట్లలో )
——————– —————————————-
నైజాం 2.89
సీడెడ్ 1.34
నెల్లూరు 0.34
కృష్ణా 0.65
గుంటూరు 0.77
వైజాగ్ 1.23
ఈస్ట్ గోదావరి 0.85
వెస్ట్ గోదావరి 0.58
ఆంధ్రా, తెలంగాణా కలిసి మొత్తం షేర్ 8.65

Related posts