ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో క్రేజ్ మామూలుగా లేదు. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంచనాలకు మించి ఉత్తరాదిన రూ.100 కోట్లు కొల్లగొట్టి మరోసారి టాలీవుడ్ సత్తాని చూపించాడు.
‘పుష్ప’ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. సెలబ్రెషన్స్ కోసం దుబాయ్ వెళ్లి.. అక్కడ నుంచి దాదాపు 16 రోజుల తర్వాత అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు.
![Anjali Anjali song | [VIDEO] Allu Arjun's daughter Arha's Anjali Anjali song is so cute that you won't stop playing it on loop](https://i.zoomtventertainment.com/story/alllll.jpg?tr=w-1600,h-900)
ఈ సందర్భంగా బన్నీకి ఆయన ముద్దుల తనయ అల్లు అర్హ వెరైటీ స్వాగతం పలికి సర్ప్రైజ్ చేసింది. చెట్లు ఆకులు, గులాబీ పూల రెక్కలు, ‘వెల్కమ్ నాన్న’అని రాసి బన్నీకి ఇంట్లోకి స్వాగతం చెప్పింది.

తన కూతురు చెప్పిన వెరైటీ స్వాగతానికి అల్లు అర్జున్ మురిసిపోయాడు. ఆ ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ..అబ్రాడ్ నుంచి తిరిగి రాగానే ‘స్వీటెస్ట్ వెల్ కమ్’ .అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

