స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్పా. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని తెగ కష్టపడిపోతున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మెస్తోంది. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా మందన్న బన్నీ సరసన నటిస్తోంది. ఈ సినిమాలో అర్జున్ సరికొత్త లుక్స్‌తో ఆకట్టుకోనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మారెడుమిల్లి అడవుల్లోని షెడ్యూల్‌ను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్నారంట. ఇదిలా ఉంటే ఈ సినిమా పై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక పుకార్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వస్తున్న రూమర్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పరిచయం చేసే సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారంట. ఈ సన్నివేశంలో అర్జున్ సిక్స్ ప్యాక్ చూపించనున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీన్‌ను హాలీవుడ్ తరహాలో చిత్రీకరించారంట. మూవీ మేకర్స్ ప్రకారం అయితే ఈ సన్నివేశంతో అభిమానులు పూనకాలు తప్పవంటున్నారు. ఈ సినిమా ఆగస్ట్13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post
next post