telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తొలిసారి స్టూడెంట్ లీడర్‌ గా అల్లుఅర్జున్ ?

Aa

మెగాస్టార్ ‘ఆచార్య’ తరువాత కొరటాల, బన్నీతో సినిమా తీయబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్‌ నడుస్తోంది. తాజాగా ఈ కాంబినేషన్ కు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో కొరటాల శివ బన్నీని స్టూడెంట్ లీడర్ పాత్రలో చూపించనున్నారట. తొలిసారిగా స్టూడెంట్ లీడర్‌గా నాటించనున్నాడు స్టైలిష్ స్టార్ . సాధారణంగా తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్‌లను మిక్స్ చేసి తెరకెక్కించే కొరటాల శివ బన్నీతో కలిసి ఎలాంటి మెసేజ్‌ను ఇవ్వనున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. ఇక వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ, ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆచార్య’ తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

Related posts