telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు

Corona

ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల నమోదులో ఎప్పటి కప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదయిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఇవాళ 43,127 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 6,051. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,02,349కి చేరాయి. ప్రస్తుతం ఏపీలో 51,701 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో 49,558 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 16,86,446 కరోనా టెస్టులు చేశారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికమయ్యాయి. సోమవారం ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 1,090 మృతి చెందారు. ఇవాళ జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,210 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 744, కర్నూలు 664, విశాఖ 655, అనంతపురం 524, నెల్లూరు 422, పశ్చిమగోదావరి 408, చిత్తూరు 367, కడప 336, ప్రకాశం 317, విజయనగరం 157, శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు నమోదయ్యాయి.

Related posts