అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్ సినిమా బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు.
బంగార్రాజులో చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. నాగ్‌తో రమ్య కృష్ణ మరోసారి జతకడుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాగలక్ష్మి పోస్టర్, బంగర్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈరోజు నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా బంగార్రాజు టీజర్ విడుదల చేశారు నాగార్జున. దీనిని ‘చిన్న బంగార్రాజు’ అంటూ నాగ్ విడుదల చేశాడు.
తాజాగా విడుదలైన టీజర్ లో నాగచైతన్య లుక్స్, బుల్లెట్‌పై వెళ్లే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య కనిపిస్తుండగా.. నాగార్జున పాత్రను చైతన్య పోషిస్తున్నట్లుగా.. తెలుస్తోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.