telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తమిళ్ హీరో అజిత్‌ కు బాంబు బెదిరింపు…

హీరో అజిత్ కు తమిళ్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగులో కూడా ఉంది. అయితే ఈరోజు అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఆయన ఇంటిలో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్‌ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అజిత్‌ ఇంటికెళ్ళి జాగిలాలతో తనిఖీలు చేశారు. కానీ ఇరువంటి బాంబు దొరకలేదు. అయితే గతంలో కూడా అజిత్ కు ఇటువంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక ప్రస్తుతం అజిత్ వినోద్ తో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తూ ఉండగా, కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడు. చూడాలి మరి ఈ సినిమాలు ఎలా ఉండనున్నాయి అనేది.

Related posts