ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్-2 మరికొన్ని రోజుల్లో చంద్రుడిపై కాలు మోపనుంది. ఈ క్రమంలో మరో కీలక ఘట్టానికి ఇస్రో వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. సోమవారం కానీ, మంగళవారం వేకువజామున కానీ, చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ ను వేరు చేయాలని ఇస్రో నిర్ణయించింది.
ఎంతో కీలకంగా భావిస్తున్న ల్యాండింగ్ మాడ్యూల్ లో విక్రమ్ర్ అనే ల్యాండర్, ప్రజ్ఞాన్ అనే రోవర్ ముఖ్య భాగాలు. వీటిసాయంతోనే చంద్రుడి దక్షిణ ధృవభాగంలో ఇస్రో పరిశోధనలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ రెండు యంత్రాలతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ను ఆర్బిటర్ నుంచి విడదీసి సెప్టెంబరు 7న చంద్రయాన్-2ను చంద్రుడిపై ల్యాండ్ చేయాలన్నది ఇస్రో ప్రణాళికల్లో భాగంగా ఉంది.