హైదరాబాద్ చార్మినార్ వద్ద ఆయుర్వేద భవన్ ని తరలించ వద్దని వైద్య విద్యార్థినులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ మహిళా పోలీసులు ఉన్నా.. మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వదిలేయమంటూ విద్యార్థినులు వేడుకున్నా ఈడ్చుకెళ్లిపోయారు.
అయితే ఈ ఘటనలో సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ పరమేష్.. ఓ విద్యార్థినిని కాలితో తన్ని, గట్టిగా గిల్లాడు. పోలీసుల దుశ్చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.దీంట్లో భాగంగా కానిస్టేబుల్ పరమేష్‌ను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సౌత్ జోన్ డీసీపీకి సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర: చంద్రబాబు