telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అక్రమ వలసదారులను .. ఉపేక్షించేది లేదు ..: అమిత్ షా

amitsha west bengal campaign

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ అవసరం లేదని మమతా బెనర్జీ ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలోనే అమిత్ షా కూడా అంతే ఘాటుగా స్పందించారు. తృణముల్ కాంగ్రెస్ ఎంతా వ్యతిరేకించినా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. చోరబాటుదారులను ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనివ్వమని చెప్పిన ఆయన దేశంలో ఉన్న శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటిసారిగా అమిత్ షా పశ్చిమబెంగాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. ఈ నేపథ్యంలోనే తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తా అనే ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

బెంగాల్‌లో పర్యటించిన అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఎన్‌ఆర్‌సీ పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. అక్రమ వలసదారులను కాపాడుకునేందుకే దీదీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. భారత దేశ వ్యాప్తంగా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్‌ఆర్‌సీ అందరిని ఏకం చేస్తుందని చెప్పిన ఆయన ఎవరిని మతాల పేరుమీద వెళ్లగొట్టమని స్పష్టం చేశారు. అక్రంగా భారత్‌లో నివాసం ఉంటున్న వారిని ఖచ్చితంగా వెళ్లగొడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు విదేశీయుల్నీ తీవ్రంగా వ్యతిరేకించిన మమతా బెనర్జీ ఇప్పుడు వారిని సమర్ధిస్తోందోని అన్నారు. మమతా బెనర్జీ వ్యతిరేకించిన సమయంలో విదేశీయులు అంతా కమ్యునిస్టులకు మద్దతుగా ఉన్నారని, కాని ఇప్పుడు మమతాకు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. అందుకే ఆమే ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. బెంగాల్ రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిందని చెప్పిన ఆయన రాష్ట్రానికి పునర్‌వైభవం తీసుకువస్తామని చెప్పారు.

Related posts