కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
చంద్రబాబు విజనరీ నాయకుడు, 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషిచేశారు. 2014లో రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍ను అశాస్త్రీయంగా విడదీశారు.
భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారు, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడింది, రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదు.
విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదు. ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయి.
రాజధాని హైదరాబాద్‍ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది, ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు, విభజిత ఏపీలో 93 వేల 121 కోట్లకు పడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడింది. అపరిష్క్రుత సమస్యాల వల్ల సవాళ్లు వచ్చాయి.
విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుంది. సన్‍రైజ్ ఆంధ్రప్రదేశ్‍కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసింది. సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది.
తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై దృష్టి సారించింది. 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయింది. ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసింది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తైంది.
ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు, కరువు నివారణ చర్యలు, రియల్ టైమ్ గవర్నెన్స్ చేపట్టారు. భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారు. కొత్త సచివాలయం, శాసనాభ భవన నిర్మాణం చేశారు. చంద్రబాబు దౄరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైంది: గవర్నర్ అబ్దుల్ నజీర్.