పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన” భీమ్లా నాయక్” చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తుంది ఈ సినిమా. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ఏ చిన్న అప్డేట్ అయ్యిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, గ్లిమ్ప్స్, పాటలు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, ‘లాలా భీమ్లా’, ‘అంత ఇష్టమేందయ్యా’ పాటలు విడుదలై యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ‘అడవి తల్లి మాటస నాలుగో సింగిల్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి ఈ సాంగ్ ను పాడగా, లిరిక్స్ రామజోగయ్య శాస్ట్రీ, మ్యూజిక్ తమన్ అందించారు. సాంగ్ లో ముందుగా దివంగత దిగ్గజ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులు అర్పించారు. అనంతరం సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ లో ఉన్న లిరిక్స్ “చెప్తున్నా నీ మంచి చెడ్డా… తోటి పంతాలు పోమాకు బిడ్డా… చిగురాకు చిట్టడివి గడ్డా… చిక్కుచ్ల్లో అట్టుడికి పోరాదు బిడ్డా” అనే లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.
ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంత్రి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.