ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పొన్నియన్ సెల్వన్”. కల్కీ రాసిన పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గత కొద్ది రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్ళింది. థాయిలాండ్‌లోని దట్టమైన అడవుల్లో చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా, మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో జయం రవి, కార్తీ, అనుష్క, విజయ్ సేతుపతి, మోహన్ బాబు, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు స్టార్స్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మొత్తం 12 పాటలని ఆయన రూపొందిస్తున్నారట. త్రిష కాస్త ఆలస్యంగా ఈ యూనిట్‌లో చేరింది. అంతేకాదు, కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను తెగ చదివేస్తోందట. కథ ప్రకారం చోళ రాజ్య రాణుల్లో ఒకరైన కుందవై పాత్రలో త్రిష నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆ పాత్ర జయంరవి పోషిస్తున్న అరుల్‌మొళి వర్మన్ పాత్రకి సోదరి కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ జంటగా ‘సంథింగ్ సంథింగ్’, ‘సకలకళా వల్లవన్’, ‘భూలోకం’ చిత్రాల్లో కలిసి నటించారు.
previous post
next post