telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ హీరో ఆఫర్ ను తిరస్కరించిన పూజాహెగ్డే ?

Pooja

ప్రస్తుతం నితిన్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే ‘ మూవీలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల నితిన్ పెళ్లి సంధర్భంగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా, కృష్ణ చైతన్యతో పవర్ పేట అనే ఓ భారీ సినిమా, అంధాదూన్ రీమేక్ చేయనున్నాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన అంధాదున్ మూవీ మంచి విజయం సాధించింది. ఆ మూవీలో నటనకు గాను హీరో ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెలుచుకున్నాడు. ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ రీమేక్ చేయనున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ మూవీ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కొరకు పూజా హెగ్డే ని సంప్రదించగా ఆమె నో చెప్పారని తెలుస్తుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పూజ నో చెప్పడం వెనుక కారణం ఏమిటీ అనేది తెలియదు.

Related posts