telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇండియన్-2″లో “గ్యాంగ్ లీడర్” భామ…!

Priyanka-Arul-Mohan

సంచలన దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ ల కాంబినేషన్ లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ మూవీ తెరకెక్కుతోంది. ‘ఇండియన్ 2’ చిత్రం పై పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన బజ్ ఉంది. ఇక ఈ సీక్వెల్ లో కమల్ తో పాటు కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ‘చందమామ’ బ్యూటీ 85 ఏళ్ల భామ పాత్రలో కనిపించబోతోంది. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ ప్రియాంకా అరుళ్ అవకాశాన్ని దక్కించుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ‘ఇండియన్ 2’ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. దీనితో ఈ చిత్రం షూటింగ్ కొంత వరకు ఆలస్యం అయ్యింది. అయితే ఈ కారణంగానే టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు ‘ఇండియన్ 2’ మూవీ నుండి తప్పుకుందట. నిజానికి ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ది కీలక పాత్ర. అందుకే ఆమె స్థానంలో మరో టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ ని చిత్ర యూనిట్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. కొంతకాలంగా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్నాయి. దీనితో డైరెక్టర్ గా శంకర్ రేసులో బాగా వెనుకపడిపోయాడు. ఈ కారణంగానే ‘ఇండియన్ 2’ విజయం సంచలన దర్శకుడికి కీలకంగా మారింది.

Related posts