telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమల్ హాసన్ తో కీర్తి సురేష్…?

Keerthy-Suresh

‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మిస్ ఇండియా’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇక ఈ అమ్మడు అటు తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాత్తే’ చిత్రంలో, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలు చేస్తుంది. అదే విధంగా యంగ్ హీరో నితిన్ తో ‘రంగ్ దే ‘ చిత్రంలోనూ నటిస్తుంది ఇదిలా ఉంటే కీర్తి మరో అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 2006లో విడుదలైన ‘రాఘవన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందబోయే సినిమాలో కమల్‌ సరసన కీర్తి నటించనుందని తెలుస్తోంది.ఈ సీక్వెల్ కు కూడా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ సినిమా ఓటిటీ లో విడుదల కాగా మంచి ఆదరణ లభించింది.

Related posts