ప్రముఖ తమిళ దర్శకుడు జె.మహేంద్రన్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారని ఆయన కుమారుడు జాన్ తెలిపారు. దర్శకుడు మహేంద్రన్ తమిళంలో ఎన్నో భారీ చిత్రాలను తెరకెక్కించారు. ముల్లుమ్ మలరుమ్, జానీ వంటి చిత్రాలు ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి. దాదాపు 80 సినిమాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్ రెండుసార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో నటించారు కూడా మహేంద్రన్. ఇప్పుడు ఆయన మరణవార్త తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళ సినిమా ప్రముఖులు మహేంద్రన్ మృతిపై తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
ఆ అజయ్ కౌండిన్య గాడిని మహిళలే తన్నుతారు… : రాకేష్ మాస్టర్